విజయనగరం జెడ్పీ ఛైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్: సర్కార్ గెజిట్ జారీ
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా పరిషత్తు ఛైర్మన్ పదవిని బీసీ మహిళకు రిజర్వు చేస్తూ ప్రభుత్వం మంగళవారం అధికారికంగా గెజిట్ జారీ చేసిందని అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మహిళలకు ఈ రిజర్వేషన్ దక్కడం ఇది మూడోసారి అని వారు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎవరికి ఈ పదవి దక్కుతుందనే అంశంపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది.