కాంగ్రెస్ మోసాలను ప్రజలే ఎండగడతారు: మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మండిపాటు
రిపోర్టర్: విజయ్
స్థలం: హుజూర్నగర్
కాంగ్రెస్ పార్టీ చేసే మోసాలను ప్రజలే త్వరలో ఎండగడతారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం హుజూర్నగర్ పట్టణంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ నమోదు సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందని, కేటీఆర్ హెచ్చరికలతోనే ప్రభుత్వం భయపడి సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.