ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక: అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
రిపోర్టర్: నరేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రానున్న రోజుల్లో వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 7 మరియు 10 తేదీల్లో వరుసగా కొత్త అల్పపీడనాలు ఏర్పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనివల్ల ఉత్తర కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. రైతులు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరారు.