తెలుగు జాతి సంపద చంద్రబాబు అంటూ ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఫైర్
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం ఒక కుటుంబానికి లేదా పార్టీకి మాత్రమే పరిమితమైన వ్యక్తి కాదని, ఆయన కోట్లాది మంది ఆత్మగౌరవమైన తెలుగు జాతికి ఒక గొప్ప సంపద అని ఎమ్మెల్సీ వర్ల రామయ్య స్పష్టం చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు.