పాలకుల నిర్లక్ష్యపు పోకడలతో నీరుగారుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు మత్తమరి సూరిబాబు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఎన్నికల్లో కష్టపడిన వారిని విస్మరించి వలసవాదులకు ప్రాధాన్యత ఇస్తున్నారని నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ శైలి వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని, ఇప్పటికైనా అసలు కార్యకర్తలను కలుపుకుని పోకపోతే హైకమాండ్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.