విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: కిరణ్ స్థలం: విశాఖపట్నం

రాష్ట్రంలో పేదలకు కలగా ఉన్న సొంతిల్లు ఇక శాశ్వత హక్కుగా మారుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం విశాఖలో 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని, 11 మండలాల పరిధిలో రూ.8,874 కోట్ల విలువైన స్థలాలను క్రమబద్ధీకరిస్తున్నామని ఆయన తెలిపారు. దశాబ్దాలుగా నివసిస్తున్న ఇంటిపై పూర్తి హక్కు కల్పించడం ద్వారా పేదల ఆత్మగౌరవాన్ని పెంచుతున్నామని, ఇది చరిత్రాత్మక సందర్భమని సీఎం చెప్పారు.