సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ ప్రత్యేక ఎఫ్డీ వడ్డీ వివరాలు
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్లపై అందిస్తున్న వడ్డీ వివరాలను బ్యాంక్ అధికారులు వెల్లడించారు. ఎస్బీఐలో 180 రోజుల ప్రత్యేక ఎఫ్డీ పథకం కింద సీనియర్ సిటిజన్లకు 6.15 శాతం వరకు వడ్డీ లభిస్తుందని తెలిపారు. సాధారణ కస్టమర్లతో పోలిస్తే వృద్ధులకు అదనపు ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.