రామాయణ చిత్రంలో శూర్పణఖ పాత్రపై రకుల్ ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: సునీల్
స్థలం: Hyderabad
రామాయణ చిత్రంలో శూర్పణఖ పాత్రలో నటించడంపై నటి రకుల్ ప్రీత్ సింగ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ, భారతీయ చారిత్రక సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే తొలి గ్లోబల్ చిత్రమిదని, శూర్పణఖ పాత్ర ఎంతో క్లిష్టమైనదని తెలిపారు. రామాయణంలో యుద్ధానికి ప్రధాన కారణమైన ఈ పాత్రలో నటించడం తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని, ప్రేక్షకులు ఈ పాత్రను విశేషంగా ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.