ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సీఎం విజయ్ పై డీఎంకే ఫిర్యాదు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: చెన్నై
మద్రాసు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఎన్నికల ప్రచారంలో డీఎంకేపై ఆరోపణలు చేసిన తమిళనాడు సీఎం విజయ్, టీవీకే నేత ఆదవ్ అర్జులపై చర్యలు తీసుకోవాలని డీఎంకే ఎంపీ జె. కాన్స్టాంటిన్ రవీంద్రన్ ఎన్నికల సంఘాన్ని కోరారు. మధురాంతకం ప్రచారంలో కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ సీఎం విజయ్ మాట్లాడారంటూ సీఈవోకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఓటర్లకు డబ్బు పంపిణీ, ప్రభుత్వ వాహనాల దుర్వినియోగంపై కూడా ఆధారాలతో ఫిర్యాదు చేశామని రవీంద్రన్ స్పష్టం చేశారు.