పాలకొండలో జోరు వానను లెక్కచేయక ప్రచారంలో దూసుకెళ్లిన జల్లు వెంకటేష్

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పాలకొండ

పాలకొండ నగర పంచాయతీ ఇరవయ్యో వార్డు స్వతంత్ర అభ్యర్థి జల్లు వెంకటేష్ మంగళవారం వర్షంలోనూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. స్థానిక అభివృద్ధికి తనను గెలిపించాలని ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.