వీరంపల్లి కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థిగా సాయి నీలిమ ఖరారు
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
మనుబోలు మండలం వీరంపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా చిగిలి సాయి నీలిమ బరిలో నిలిచారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆమెను అధికారికంగా ప్రకటించారు. ప్రత్యర్థి పార్టీలకు గట్టి బుద్ధి చెప్పేలా కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన స్థానిక ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి విజయం సాధించాలని స్పష్టం చేశారు.