వర్ధన్నపేట ప్రభుత్వ బడి విద్యార్థులకు అండగా నిలిచిన ఎన్నారై పూర్వవిద్యార్థి
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుని అమెరికాలో స్థిరపడిన పూర్వ విద్యార్థి మార్త రాజు తన మాతృ పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, స్టడీ మెటీరియల్ను ఉచితంగా పంపిణీ చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు స్థానికులు పాల్గొన్నారు.