మున్సిపల్ ఎన్నికలకు భారీ భద్రత: ముప్పై ఆరు వేల మందితో బందోబస్తు

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు కేంద్రాల్లో ముప్పై ఆరు వేల మూడు వందల ఏభై ఒక్క మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ హరీష్కుమార్ గుప్తా తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.