సింగరేణి ఇళ్ల స్థలాల హక్కు పత్రాలపై మంత్రి పొంగులేటి సమీక్ష
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
సింగరేణి ప్రాంతంలో దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న కుటుంబాల ఇళ్ల స్థలాల హక్కు పత్రాల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. హైకోర్టు ఆదేశాల మేరకు 45 రోజుల్లోపు పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షుడిగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.