ముంబైలో కన్నా గ్యాంగ్ అరెస్ట్: మోకా చట్టం కింద కేసులు నమోదు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: మహారాష్ట్ర

ముంబైలో మథాడీ కార్మిక సంఘం పేరుతో దందాలు చేస్తున్న కన్నా గ్యాంగ్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఏడుగురు సభ్యులను అరెస్ట్ చేసి, వారిపై కఠినమైన మోకా (MCOCA) చట్టాన్ని ప్రయోగించారు. కంపెనీలు, డెవలపర్లను బెదిరించి కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడుతున్న ఈ ముఠా, అడ్డుకున్న వారిపై దాడులకు తెగబడింది. ప్రధాన నిందితులు పరారీలో ఉండగా, గ్యాంగ్ అరాచకాలపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.