రైతుల బతుకులను ఛిద్రం చేస్తున్న 22ఏ చట్టం:: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య...
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని పల్లంగూడ గ్రామపంచాయతీ పరిధి గోండుగూడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజనుల ఆత్మీయ సమావేశానికి బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, 22ఏ భూ చట్టం పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రైతుల భూములను 22ఏ సెక్షన్ నుంచి తొలగించే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.