యాదాద్రి జిల్లాలో సంచలనం: జోగిని సుధాకర్ స్వామి హత్య కేసు ఛేదన

రిపోర్టర్: రాము స్థలం: యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో సంచలనం సృష్టించిన జోగిని రాళ్లబండ సుధాకర్ స్వామి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అస్సాంకు చెందిన పవన్, హర్షులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నమ్మకం సంపాదించి ఇంట్లోకి ప్రవేశించి, పెప్పర్ స్ప్రే చేసి దారుణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.1.72 కోట్ల విలువైన బంగారం, వెండి, నగదుతో పాటు కారును స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.