ఉత్తరాంధ్ర తీరంలో అల్పపీడనం ప్రభావం.. భారీ వర్షాలు
రిపోర్టర్: గోపి
స్థలం: విశాఖపట్నం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడనుందని తెలిపింది. తీర ప్రాంతంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.