మెటాపై రూ.3,700 కోట్ల అడల్ట్ మూవీస్ కాపీరైట్ కేసు

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమెరికా

ఏఐ శిక్షణ కోసం వేలాది అడల్ట్ సినిమాలను చట్టవిరుద్ధంగా డౌన్‌లోడ్ చేసిందంటూ అమెరికాకు చెందిన స్ట్రైక్ 3 హోల్డింగ్స్ సంస్థ మెటాపై కోర్టులో కేసు నమోదు చేసింది. బిట్‌ట్రెంట్ ద్వారా మెటా ఎగ్జిక్యూటివ్ ఈ వీడియోలను సేకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు రుజువైతే మెటా భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది.