ఇటలీ ప్రధానిగా జార్జియా మెలోనీ సరికొత్త చారిత్రక రికార్డు సృష్టి

రిపోర్టర్: కృష్ణ స్థలం: World

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో అత్యధిక కాలం పదవిలో ఉన్న ప్రధానిగా జార్జియా మెలోనీ రికార్డు సృష్టించారు. 1,413 రోజులుగా నిరంతరాయంగా పాలన సాగిస్తూ ఆమె చరిత్ర తిరగరాశారు. ఈ ఘనతపై భారత ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు. ఇటలీ ప్రజల నమ్మకానికి ఇది నిదర్శనమని, భారత్-ఇటలీ బంధాన్ని ఆమె మరింత బలోపేతం చేశారని మోదీ కొనియాడారు. ఈ ప్రశంసలకు మెలోనీ కృతజ్ఞతలు తెలిపారు.