రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితుల కట్టడికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులను సమీక్షించి తగిన చర్యలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు సీఎస్ సంజయ్ జాజు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్గా వ్యవహరించనున్న ఈ కమిటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సభ్యులుగా కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.