భారతీయ పైలట్ సాహసాన్ని కొనియాడిన ప్రధాని నరేంద్ర మోడీ
రిపోర్టర్: వెంకట్
స్థలం: న్యూఢిల్లీ
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తుండగా ఫ్లై దుబాయ్ విమానంలో ప్రమాదం ఎదురైనప్పటికీ, తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ అద్భుతమైన ధైర్యసాహసాలు ప్రదర్శించి వందలాది ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ సాహసాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆయన తెగింపు పెద్ద విషాదాన్ని నివారించిందని, భారత్ తన బిడ్డను చూసి గర్విస్తోందని ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ కొనియాడారు.