బిగ్ బాస్ తెలుగుకు నీల్‌కమల్ స్లీప్ అధికారిక స్పాన్సర్

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ

ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం నీల్‌కమల్ లిమిటెడ్‌కు చెందిన మ్యాట్రెస్ బ్రాండ్ 'నీల్‌కమల్ స్లీప్', బిగ్ బాస్ తెలుగు తాజా సీజన్‌కు అధికారిక అసోసియేట్ స్పాన్సర్‌గా ఎంపికైంది. హౌస్‌లోని కంటెస్టెంట్ల బెడ్‌రూమ్‌లలో తమ బౌన్స్ ఫోమ్ ఆర్థోపెడిక్ మ్యాట్రెస్‌లను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. నాణ్యమైన నిద్ర, విశ్రాంతి ప్రాముఖ్యతను ఈ వేదిక ద్వారా ప్రేక్షకులకు చేరవేయనున్నట్లు జాయింట్ ఎండీ శ్రీ పరేఖ్ తెలిపారు.