తెలంగాణ పోరాట యోధుల త్యాగాలను స్మరిస్తూ సాగుతున్న వారోత్సవాలు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలు వెలకట్టలేనివని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిగుళ్ల లింగం అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగులలో సంఘం నారాయణ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సాయుధ పోరాటంలో పాల్గొని భూస్వామ్య, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల త్యాగాలను స్మరించుకుంటూ 78వ తెలంగాణ సాయుధ పోరాట యోధుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.