అన్నదాతలకు తీపి కబురు: నెల్లూరులో సెంట్రల్ అగ్రిల్యాబ్ ప్రారంభానికి సిద్ధం
రిపోర్టర్: సురేష్
స్థలం: నెల్లూరు
అన్నదాతలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే సెంట్రల్ అగ్రిల్యాబ్ ప్రారంభానికి సిద్ధమైందని అధికారులు తెలిపారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను పరీక్షించి రైతులకు నాణ్యమైనవి అందించాలన్న లక్ష్యంతో నెల్లూరులో ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిధుల కొరతతో పనులు ఆలస్యం కాగా, కూటమి ప్రభుత్వం వచ్చాక పురోగతి సాధించి పూర్తి చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే ఈ ప్రయోగశాలను అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు పూర్తిస్థాయి సేవలు అందిస్తామని అధికారులు స్పష్టం చేశారు.