కూతురితో గడుపుతున్న సమయాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నానంటూ నటుడు జై భానుశాలి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
మాజీ భార్య మహి విజ్ బిగ్బాస్ రియాలిటీ షోలో పాల్గొంటున్న నేపథ్యంలో, కుమార్తె తారతో ఎక్కువ సమయం గడపడాన్ని తాను ఎంతో ఆస్వాదిస్తున్నట్లు నటుడు జై భానుశాలి వెల్లడించారు. ఈ దశలో తండ్రి, కూతుళ్ల మధ్య అనుబంధం మరింత బలపడిందని ఆయన పేర్కొన్నారు. మహి షో గెలవాలని తాను కోరుకుంటున్నానని, అదే సమయంలో తన కూతుారితో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభించిందని జై భానుశాలి స్పష్టం చేశారు.