దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

రిపోర్టర్: కిరణ్ స్థలం: India

దేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సెప్టెంబర్ 13 వరకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఢిల్లీలో పాక్షికంగా మేఘాలు కమ్ముకుని తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. తమిళనాడులోని పశ్చిమ కనుమల జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చని ఐఎండి హెచ్చరించింది.