ఇళ్ల వద్దే లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఓబులవారిపల్లి

ఓబులవారిపల్లి మండలంలోని ఐదు గ్రామాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హైలరాచపల్లి, యల్లాయపల్లి, మంగంపేట, ఎద్దులవారిపల్లి, చిన్నంపల్లి గ్రామాల్లోని ఐదుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.3,57,140 విలువైన ఆర్థిక సాయం చెక్కులను వారి నివాసాల వద్దే అందజేశారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులు పంపిణీ చేశారు.