హైదరాబాద్లో నీటి సరఫరా బంద్పై ప్రచారం: వైరల్ వార్తలను ఖండించిన జలమండలి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Hyderabad
హైదరాబాద్లో నవంబర్ చివరి నాటికి రిజర్వాయర్లు ఎండిపోతాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని జలమండలి అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు తాము ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదని తెలిపారు. నగరంలో నీటి సరఫరా నిలిచిపోతుందంటూ వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని, ఎలాంటి నిర్ధారణ లేని తప్పుడు సందేశాలను ఇతరులకు ఫార్వర్డ్ చేసి ఆందోళన సృష్టించవద్దని వాటర్ బోర్డు హెచ్చరించింది.