వ్యక్తిగత డేటా భద్రతపై పార్వతీపురం మన్యం పోలీసులు కీలక హెచ్చరిక
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: పార్వతీపురం మన్యం
పార్వతీపురం మన్యం జిల్లాలో సైబర్ నేరాల పట్ల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఆధార్, పాన్ కార్డ్ వంటి వ్యక్తిగత వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులతో షేర్ చేసుకోవద్దని సూచించారు. ఆఫర్లు, డిస్కౌంట్ల కోసం అపరిచిత వెబ్సైట్లలో లాగిన్ కావద్దని, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ వివరాలు ఇస్తే సైబర్ మోసగాళ్ల బారిన పడే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.