తెలంగాణలో దసరా కానుకగా కొత్త చేయూత పింఛన్ల పంపిణీ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో దసరా పండుగ సందర్భంగా కొత్త చేయూత పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2.5 లక్షల పింఛన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అక్టోబర్ మొదటి వారంలో తుది ఎంపిక పూర్తి కానుంది. అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఆలస్యం జరగకుండా అధికారులు దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేశారు.