నవంబర్ రెండో వారంలో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులు

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజీల పునరుద్ధరణ పనులను వచ్చే నవంబర్ రెండో వారంలో అధికారికంగా ప్రారంభిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్రెడ్డి స్పష్టం చేశారు. శనివారం జరిగిన కీలక సమీక్షలో ఆయన మాట్లాడుతూ, నిపుణుల కమిటీల సూచనల మేరకు పనులను వేగవంతం చేసి 2027 వానాకాలం నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. అక్టోబర్ 5న సమగ్ర డిజైన్లను సెంట్రల్ వాటర్ కమిషన్కు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.