విద్యుత్‌ వినియోగదారులకు రూ.629 కోట్ల ట్రూడౌన్‌ నిర్ణయం వెల్లడించిన ఏపీఈఆర్‌సీ

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

రాష్ట్రంలోని విద్యుత్‌ వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాదీ ఊరట కల్పించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని సర్దుబాట్ల తర్వాత రూ.629.35 కోట్లు ట్రూడౌన్‌ చేసేందుకు అనుమతిస్తూ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని భవిష్యత్తులో వసూలు చేసే బిల్లుల్లో సర్దుబాటు చేయాలని డిస్కంలను నిర్దేశించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్‌ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం మోపకుండా చర్యలు తీసుకుంటోంది.