'శాసనసభ కాదది దుశ్శాసనసభ': రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Hyderabad
శాసనసభ కాస్తా దుశ్శాసనసభగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఒకవైపు 'స్మాష్ ది పితృస్వామ్యం' అంటారని, కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి వంటి వారి గొంతు పట్టుకుని దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ రేవంత్ రెడ్డి ప్లానేనని ఆరోపించారు.