హైదరాబాద్‌లో మెట్రో, ఆర్టీసీలకు ఒకే కామన్ పాస్ జారీ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Hyderabad

హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల సౌలభ్యం కోసం మెట్రో రైళ్లు మరియు ఆర్టీసీ బస్సుల్లో ఒకే కామన్ పాస్ విధానాన్ని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. నెలవారీ మరియు రోజువారీ పాస్‌ల జారీపై రసూల్‌పురాలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పాతబస్తీ మెట్రో విస్తరణ పనులను వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.