సావల్యాపురం గుంటూరు రైల్వే సెక్షన్ ఆధునీకరణకు 142 కోట్ల నిధులు మంజూరు
రిపోర్టర్: విజయ్
స్థలం: గుంటూరు
సావల్యాపురం-గుంటూరు రైల్వే సెక్షన్ పరిధిలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్గంలో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్‌ను ఆధునీకరించేందుకు రికార్డు స్థాయిలో రూ. 142 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ ఆధునీకరణ ప్రాజెక్టు ద్వారా విద్యుత్ సరఫరా వ్యవస్థను పునర్నిర్మించడంతో పాటు కొత్తగా సబ్స్టేషన్ల నిర్మాణం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనివల్ల రైళ్ల వేగం పెరగడంతో పాటు ప్రయాణ సమయం తగ్గనుంది.