మురుమడుగులో పేదలపై అటవీశాఖ అధికారుల వేధింపులను సహించబోమంటూ పద్మ హెచ్చరిక

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మురుమడుగు గ్రామంలో ఉన్న ప్రజలను అటవీశాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేయవద్దని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ అన్నారు. శనివారం ఆమె సిపిఎం నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించి ఎస్సీ కాలనీలో అధికారులు వేసిన స్ట్రించులను పరిశీలించారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న నిరుపేదలను వేధించడం అన్యాయమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.