విజయనగరం ఆలయంలో భారీ చోరీ: నగల మాయంతో ఉలిక్కిపడ్డ అయ్యన్నపేట

రిపోర్టర్: రాజేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా కేంద్రంలోని అయ్యన్నపేట అరుంధతీనగర్ వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. ఆలయం తాళాలు పగులగొట్టిన దుండగులు సుమారు నలభై ఐదు గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులను ఎత్తుకెళ్లినట్లు ప్రధాన అర్చకుడు రాజేష్కుమార్ తెలిపారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఈ దుర్మాఘానికి పాల్పడిన అయిదుగురు నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు డీఎస్పీ ఎస్.లక్ష్మణమూర్తి వెల్లడించారు.