ఓటర్లకు గుడ్ న్యూస్: ఓటరు కార్డు లేకున్నా ఓటేసేందుకు అవకాశం
రిపోర్టర్: నరేష్
స్థలం: నెల్లూరు
స్థానిక సంస్థల ఎన్నికల్ లో ఓటర్లు తమ హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను అనుమతించినట్లు అధికారులు తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు లేని పక్షంలో ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డుతో పాటు వివిధ ప్రభుత్వ గుర్తింపు కార్డుల్ లో ఏదైనా ఒకదాన్ని చూపించి ఓటు వేయవచ్చని అధికారులు స్పష్టం చేశారు. నేడు జరగనున్న పోలింగ్ లో ఓటర్లు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు.