ప్రైవేట్ కాలేజీల అక్రమ ఫీజుల దోపిడీపై ప్రవీణ్ కుమార్ నిప్పులు
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో పదవ తరగతి, ఇంటర్ విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజుల పేరుతో యాజమాన్యాలు భారీగా వసూలు చేస్తున్నాయని విద్యార్థి జనసమితి జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేయడం వల్ల పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వెంటనే అధికారులు స్పందించి ఈ దోపిడీని అరికట్టాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.