అమెరికాలో వైభవంగా శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ మరియు శ్రీ శ్యామ శాస్త్రి ఉత్సవాలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Maryland, USA

అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం లాన్హామ్లో ఉన్న ప్రసిద్ధ శ్రీ శివ విష్ణు ఆలయం ఆధ్వర్యంలో 23వ వార్షిక శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ మరియు శ్రీ శ్యామ శాస్త్రి సంగీతోత్సవాలు ఘనంగా ఏర్పాటయ్యాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ 31, నవంబర్ 1వ తేదీలలో రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయని, సంగీత ప్రియులందరికీ ప్రవేశం పూర్తిగా ఉచితమని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు పాల్గొని అద్భుతమైన శాస్త్రీయ సంగీత కచేరీ ప్రదర్శించనున్నారని నిర్వాహకులు స్పష్టం చేశారు.