అమెరికాలో ఘనంగా తానా ఫుడ్ డ్రైవ్: 1,800 పౌండ్ల ఆహార విరాళం
రిపోర్టర్: అశోక్
స్థలం: పెన్సిల్వేనియా
అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మిడ్-అట్లాంటిక్ ఆధ్వర్యంలో జరిగిన ఫుడ్ డ్రైవ్లో యువ వాలంటీర్లు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. తానా బోర్డు సభ్యుడు రవి పొట్లూరి తెలిపిన వివరాల ప్రకారం, ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 1,800 పౌండ్ల ఆహార పదార్థాలను సేకరించి గ్రేస్ హౌస్ మినిస్ట్రీస్కు విరాళంగా అందించారు. నవంబర్ 30 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, వివిధ చాప్టర్ల ద్వారా సామాజిక సేవలను మరింత విస్తృతం చేస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.