పాలిటెక్నిక్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు: మంత్రి వివేక్

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని మంత్రి వివేక్ వెంకటస్వామి శాసనసభలో స్పష్టం చేశారు. రూ. 8,000 కోట్లతో కళాశాలలను అప్‌గ్రేడ్ చేసి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ప్రైవేటీకరణపై బిఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలు అవాస్తవమని, జీవో 97లో అవసరమైతే మార్పులు చేస్తామని తెలిపారు. కళాశాలల్లో ఎలాంటి ఫీజుల పెంపు ఉండదని, పేద విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందిస్తామని తేల్చిచెప్పారు.