సర్వేపల్లిలో భారీగా సీఎంఆర్ఎఫ్ పంపిణీ: నేడు 77 మందికి ఆర్థిక సాయం
రిపోర్టర్: sujith reddy
స్థలం: నెల్లూరు రూరల్
నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 77 మంది బాధితులకు నూతన చెక్కులను అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు నియోజకవర్గంలో 1118 మందికి తొమ్మిది కోట్ల ఎనభై లక్షల రూపాయల సహాయం అందించినట్లు తెలిపారు. సీఎం సహాయనిధి పేద ప్రజలకు గొప్ప సంజీవనిలా ఉపయోగపడుతోందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.