థాయిలాండ్లో భారతీయుల తీరుపై డిజిటల్ క్రియేటర్ స్పర్ష్ సునీల్ ఆగ్రహం
రిపోర్టర్: రమేష్
స్థలం: New Delhi
విదేశాల్లో భారతీయుల ప్రవర్తన దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని డిజిటల్ క్రియేటర్ స్పర్ష్ సునీల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల థాయిలాండ్లో పర్యటించిన ఆయన, అక్కడ కొందరు భారతీయ టకులు నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. థాయ్ హోటళ్లలో ప్రత్యేకంగా హిందీలో హెచ్చరిక బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి రావడం మనకు సిగ్గుచేటని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ దేశానికి రాయబారులమని గుర్తుంచుకోవాలని సూచించారు.