అనంతగిరిలో అసంపూర్తిగా హెల్త్ సబ్ సెంటర్.. 13 గ్రామాల గిరిజనుల ఆవేదన
రిపోర్టర్: Laxman Regam
స్థలం: అనంతగిరి
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోటలో హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణం ఏళ్ల తరబడి అసంపూర్తిగా నిలిచిపోయింది. దీంతో 13 గ్రామాల ఆదివాసీలకు కనీస వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం చిన్నపాటి అనారోగ్యానికి కూడా గిరిజనులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి, అధికారులు వెంటనే స్పందించి భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.