ఐఏఎస్‌ అధికారులపై పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు

రిపోర్టర్: సతీష్ స్థలం: కృష్ణా

ఐఏఎస్‌ అధికారులపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకు అనుకూలంగా బుద్ధి లేకుండా వ్యవహరిస్తున్న ఐఏఎస్‌ అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మచిలీపట్నంలో జరిగిన వైకాపా జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లోకేశ్‌ అక్రమాలు వెలుగుచూస్తున్నాయని, అధికారులను బలిచేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.