గాజువాకలో పింఛన్ల పంపిణీ: ఒకటో తారీకునే పేదల ఖాతాల్లోకి కూటమి కానుక

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

గాజువాక నియోజకవర్గం డెబ్బై మూడో వార్డులో ఒకటో తారీకునే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఘనంగా జరిగింది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు మరియు విశాఖపట్నం కలెక్టర్ ముత్తింబాకు అభిషిక్త్ కిషోర్ స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం ప్రజలతో అభివృద్ధిపై చర్చా గోష్టి నిర్వహించగా అధికారులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.