"యుద్ధం ముగింపు దశకు చేరింది": జీసీసీ దేశాల నేతలతో డోనాల్డ్ ట్రంప్ భేటీ
రిపోర్టర్: హరి
స్థలం: వరల్డ్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ న్యూయార్క్‌లో గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) దేశాల నాయకులు మరియు విదేశాంగ మంత్రులతో సమావేశం కానున్నారు. ఇరాన్‌తో యుద్ధం మరియు అనంతర పరిణామాలపై చర్చించేందుకు యూఎన్ జనరల్ అసెంబ్లీ వేదికగా ఈ కీలక భేటీ జరగనుంది. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశంలో యుద్ధానంతర వ్యూహాలపై ప్రధానంగా చర్చిస్తామని, ఇరాన్‌తో ఒప్పందం దిశగా చర్చలు సాగుతున్నాయని ట్రంప్ స్పష్టం చేశారు.