స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమీక్ష

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయవాడ

స్థానిక సంస్థలకు త్వరలో నిర్వహించనున్న ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేఠా విజయవాడలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల సన్నద్ధతపై ఆరా తీశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ మధుసూధన్రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొని ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు.